Reading Time: < 1 minute

అధికారులు అలర్ట్ గా ఉండాలి : సీపీ అంబర్ కిశోర్ ఝా 

Caption of Image.

మంచిర్యాల, వెలుగు: పోలింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించేవరకు అధికారులు అలర్ట్​గా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్ పరిధి ఎన్టీపీసీలోనీ ప్రభుత్వ హైస్కూల్, టీటీఎస్, మంచిర్యాలలోని ఆర్బీహెచ్‌వీ, క్రిస్ట్ స్కూల్ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

బందోబస్తు, భద్రతాచర్యలు, క్యూలైన్ల నిర్వహణ, వృద్ధులు, దివ్యాంగుల కోసం కల్పించిన ప్రత్యేక సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల శాంతి భద్రతల కోసం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.