Reading Time: < 1 minute

వామ్మో.. జింబాబ్వే జట్టు ఎప్పుడూ డేంజరే.. పసికూన ఒమన్ను ఎలా ఓడించారో చూడండి !

Caption of Image.

కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సోమవారం జరిగిన జింబాబ్వే, ఒమన్ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో.. తొలుత బ్యాటింగ్కు దిగిన ఒమన్ జట్టు జింబాబ్వే బౌలర్ల ధాటికి 103 పరుగులకే 19.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఒమన్ బ్యాటర్లలో వినాయక్ శుక్లా 28 పరుగులు, సూఫ్యాన్ మొహమూద్ 25, నదీమ్ ఖాన్ 20 పరుగులు.. ఈ ముగ్గురే కాస్తోకూస్తో పరుగులు రాబట్టారు. మిగిలిన ఒమన్ ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేశారు. ఇద్దరు డకౌట్గా వెనుదిగారు.

అమీర్ ఖలీమ్ 5, జతీందర్ సింగ్ 5, వసీమ్ అలీ 3, జితన్ రామనంది 1, షకీల్ అహ్మద్ 4, షా ఫైజల్ 5 పరుగులు.. ఇలా జింబాబ్వే బౌలర్లు ఒమన్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు, సికందర్ రజా ఒక వికెట్తో రాణించారు. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 13.3 ఓవర్లకే 106 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. బ్రియాన్ బెన్నెట్ 48 పరుగులు, బ్రెండన్ టేలర్ 31 పరుగులతో రాణించారు.

©️ VIL Media Pvt Ltd.