
సంక్రాంతి పండుగ నిజామాబాద్‌కు వచ్చిందంటే, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఘేవర్ స్వీట్ కోసం గంజ్ ఏరియాకు క్యూ కడతారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే నగరంలోని మార్కెట్ కళకళలాడుతుంది. రాజస్థాన్ సంప్రదాయానికి చెందిన ఈ ఘేవర్, గత 20 సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులకు ప్రీతిపాత్రమైంది. సాధారణంగా పిండి వంటకాల కోసం మార్కెట్‌కు వెళ్లే ప్రజలు, ఇక్కడ మాత్రం ఈ ప్రత్యేక స్వీట్‌ను ఆస్వాదించడానికి వస్తారు. ఈ స్వీట్ సాధారణ సమయాల్లో లభించదు. కేవలం సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచి మాత్రమే అందుబాటులో ఉంటుంది. పండుగ ముగియగానే దీని తయారీ ఆగిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!