Reading Time: < 1 minute
విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. చమురు ధరల పెరుగుదల, విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్లైట్ల నిషేధం, వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో పనిదినాల తగ్గింపు, విద్యుత్ పొదుపు ఆంక్షలు వంటివి తెరపైకి తీసుకొస్తున్నాయి. పౌరుల జీవనశైలిలో గణనీయమైన మార్పులు అనివార్యమంటున్నాయి. వీవీఐపీ సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. తన కాన్వాయ్‌లో.. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా చూడాలన్నారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండానే అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై తనకున్న నిబద్ధతను చాటుతూనే.. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా మోదీ ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని మోదీ బాటలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించారు. మొత్తానికి అత్యున్నత పదవిలో ఉన్నవారే ఇలా పొదుపు చర్యలు పాటించడం ద్వారా అటు అధికారులకు, ఇటు సామాన్య ప్రజలకు ప్రధాని మోదీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్లు అయింది.

మరిన్ని వీడియోల కోసం :

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు

ట్రెండింగ్ బ్యూటీ హెల్ప్ తీసుకుంటున్న చియాన్‌ విక్రమ్‌

డైలాగ్ వార్ : ఇండస్ట్రీ ఇగోస్

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ