Reading Time: < 1 minute

తిరుపతి గరుడ వారధిపై ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు.. 12 మందికి గాయాలు

Caption of Image.

తిరుమల: తిరుపతి గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది.  ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్‎ను మరో ఆర్టీసీ బస్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షత్రగాత్రులను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఘటన స్థలానికి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. డ్రైవర్ తప్పిదం వలన ప్రమాదం జరిగిందా లేక సాంకేతిక సమస్యతో బ్రేక్ ఫైల్ అయ్యిందా అనేది విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.