Reading Time: < 1 minute

భువనేశ్వర్: పెళ్లి జరిగిన తరువాత వధువుతో వరుడు తన ఇంటికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యతో పెళ్లి కుమార్తెను కిడ్నాప్ చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొలంగీర్ లోని కామాక్షినగర్ కు చెందిన రింకు అనే యువకుడు, బౌద్ధ్ జిల్లాకు చెందిన ఓ యువతిని ఆదివారం పెళ్లిచేసుకున్నాడు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెళ్లి కుమార్తె, కుమారుడు కారులో వరుడు ఇంటికి బయలు దేరారు.తర్బాపట్టణ శివారులోకి రాగానే కారును కొందరు దుండగులు ఆపి వాహనంలో ఉన్నవారిని బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. వెంటనే వరుడు రింకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో వధువుకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు స్థానికులు ఆరోపణలు చేశారు. ఆమె ప్రియుడే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.