Reading Time: < 1 minute

Sai Dhanshika : సెల్ఫీ కోసం వేధించిన ఆకతాయికి చుక్కలు చూపించిన సాయి ధన్సిక!

Caption of Image.

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ మూవీతో కుర్రకారును మెప్పించిన ముద్దుగుమ్మ సాయి ధన్సిక. ఆతర్వాత ‘షికారు’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అలాగే ‘అంతిమ తీర్చు’తో పాటు, తమిళ, మలయాళ, కన్నడచి త్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు లీడ్ రోల్ లో  నటించిన ‘యోగి డా’ చిత్రం ఈ నెల 6న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. తన నటనతో సినీ ప్రియులను మెప్పించింది.  

ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించింది. గౌతమ్ కృష్ణ దర్శ కత్వం వహించగా.. వీ సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా యోగి డా మూవీ ప్రమోషన్స్ పాల్గొన్న సాయిధన్సిక.. ఓ ఇంటర్వూలో తన జీవితంలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. కేరళలో మూవీషూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు మద్యం తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదని చెప్పింది..

 దీంతో మద్యం తాగి ఉన్న వ్యక్తి తన అంకుల్ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని చెప్పింది సాయి ధన్సిక. అది చూసి కోపంలో వెళ్లి అతడిని చితకబాదా, దర్శకుడు, హీరో సన్ను కంట్రోల్ చేసేందుకు ట్రై చేశారు అని తెలిపింది.. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ దురుకోలేదు. అందుకే విచక్ష ణారహితంగా కొట్టాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్ త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే!

©️ VIL Media Pvt Ltd.