Reading Time: < 1 minute

మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 చోట్ల జనసేన పార్టీ బరిలో నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టింది.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 336 వార్డులు, డివిజన్లలో జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారని శుక్రవారం జనసేన పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది. 

వీరంతా పార్టీ అధికారిక చిహ్నమైన ‘గాజు గ్లాస్’ గుర్తుపై పోటీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఈ క్రమంలో అభ్యర్థులకు ఇప్పటికే పార్టీ బీఫామ్స్‌‌ను అందజేసినట్టు తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.