Reading Time: < 1 minute

దిశాసాలియన్ ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి.. సీబీఐకి అప్పగించాలని ముంబై హైకోర్టు ఆదేశం

Caption of Image.

ఆరేళ్ల నాటి కేసు.. అప్పట్లో అది ఆత్మహత్య కేసు..ప్రముఖ బాలీవుడ్ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తన బిడ్డది ఆత్మహత్య కాదని, రేప్ చేసి హత్య చేశారని దిశా తండ్రి సతీస్ సాలియన్ ఫిర్యాదుతో విచారణకు స్వీకరించిన ముంబై హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఫుల్ డిటెయిల్స్..   

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించింది. 2020లో దిశా మృతిచెందిన పరిస్థితులపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని జస్టిస్‌ సారంగ్ కోట్వాల్, జస్టిస్ రంజిత్‌సింహ రాజా భోంసలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ఈ కేసును సీనియర్ అధికారికి అప్పగించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. రిపోర్టును సవాలు చేసే స్వేచ్ఛ సతీష్ సాలియన్‌కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 

2020 జూన్ 8 ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి దిశా సాలియన్ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రమాదవశాత్తు మరణం కేసును నమోదు చేశారు. విచారణ అనంతరం దిశ మరణం ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. అయితే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.