
- భారీ భద్రత ఉన్నా చోరీ ఎలా జరిగింది
- 30వ తేదీ రాత్రి ఆర్మరీకి సీల్.. 31న మాయం
- ఆర్మరీ వైపు వాహనం వచ్చిన ఆనవాళ్లు లేవ్
- తాళాలు పగుల గొట్టి ఎవరు తీసుకెళ్లారు?
- ఇంటి దొంగల పనేనా.. వెపన్స్ ఎక్కడికి వెళ్లాయి
- బొల్లారంలోని మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో వెపన్స్ మాయంపై పోలీసుల విచారణ షురూ
- 15 మందిని ప్రశ్నించిన స్థానిక పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్‌లో ఆదివారం జరిగిన ఆయుధాల చోరీ ఘటన పెను సంచలనంగా మారింది. అత్యంత పటిష్ట భద్రత ఉండే బెటాలియన్‌లోని ఆర్మరీ (ఆయుధాలు భద్రపరిచే గది) నుంచి ఏకే 203, ఇన్సాస్ రైఫిల్స్ సహా 10 రకాల తుపాకులు, మ్యాగజైన్స్మాయమయ్యాయి. సోమవారం ఉదయం అందిన ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు రంగంలోకి దిగారు. ఇది ఇంటి దొంగల పనా? లేదంటే ఎవరైనా బయట వ్యక్తులు ఎత్తుకెళ్లారా? ఎందుకు చోరీ చేశారు? ఎక్కడ దాచారో కనిపెట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 15 మందిని విచారించి పలు వివరాలు రాబట్టారు. అటు సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. కాగా.. ఘటన తీవ్రత దృష్ట్యా అటు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఆర్మీ 20, మద్రా స్ రెజిమెంట్ బెటాలియన్ నిర్వహిస్తున్నారు. ఆర్మీ సి బ్బందికి అవసరమైన ఇన్సాస్ సహా ఏకే 203 అసా ల్ట్ రైఫిల్స్, అత్యాధునిక పిస్టల్స్, మ్యాగజైన్స్, బుల్లెట్లు, ఇతర మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు ఆర్మరీ రూమ్స్(కోట), బెటాలియన్ మ్యాగజైన్ ఏర్పాటు చేశారు. ఆర్మరీ వద్ద షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున గార్డ్స్ డ్యూటీ చేస్తుంటారు. ఆర్మరీలోని వెపన్స్‌ను రోజూ తనిఖీ చేసి నంబర్ల వారీగా రికార్డుల్లో ఎంట్రీ చేసి సరిచూసుకుంటారు. రెగ్యులర్ ప్రొసీజ ర్లో భాగంగా ఆర్మరీలో ఆదివారం సాయంత్రం 6 గం టలకు నిల్వలు చెక్ చేసి సీల్ వేశారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 7.50 గంటలకు ఆర్మరీ తెరి చే సమయంలో తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నట్టు సిబ్బంది గమనించారు. ఉన్నతాధికారులకు సమాచా రం అందించడంతో లెఫ్ట్‌నెంట్ కల్నల్ మయాంక్ ఘటనా స్థలానికి చేరుకొని 4 ఏకే 203 అసాల్ట్ రైఫి ళ్లు, పిస్టళ్లు సహా మొత్తం10 రకాల ఆయుధాలు, మ్యాగజైన్లు మాయమైనట్టు గుర్తించారు. వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటి దొంగల పాత్రపైనే అనుమానాలు..
బయట వ్యక్తులు ప్రవేశించలేని అత్యంత పటిష్టమైన భద్రత గల ప్రాంతం.. ఆదివారం రాత్రి ఆ ఏరియాలో భారీ వర్షం పడడం.. ఆర్మర్ రూమ్‌వైపు ఎలాంటి వాహనం వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆయు ధాల చోరీ వెనుక ఇంటి దొంగల హస్తం ఉం డొచ్చనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆర్మరీ రూమ్స్, బెటాలియన్ మ్యాగజైన్ సిబ్బందిని మంగళవారం విచారించారు. వారం రోజులుగా గార్డ్ డ్యూటీలు నిర్వహించిన 15 మందిని ప్రశ్నించినట్టు తెలిసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌తోపాటు కేంద్ర నిఘా సంస్థలు ఈ ఘటనపై దృష్టి సారించాయి. ఆయుధాలు ఎవరు, ఎందుకు ఎత్తుకెళ్లారు? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
చోరీకి గురైన ఆయుధాలు..
మందుగుండు సామగ్రి వివరాలు
- 4 ఏకే -203 7.62×39 ఎమ్‌ఎమ్ అసాల్ట్ రైఫిళ్లు,
- 5 మ్యాగజైన్లు, 720 రౌండ్ల బుల్లెట్లు
- 5.56 ఎంఎం ఇన్సాస్ 1 బీ 1 రైఫిల్,
- 3 మ్యాగజైన్లు,11 బాల్ రౌండ్లు
- ఆరు 9 ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్స్,
- 12 మ్యాగజైన్లు ,1,120 రౌండ్స్
- 6.35 బోర్ పిస్టల్, మ్యాగజైన్
- పాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్
- 5 ట్రేసర్ రౌండ్లు, 20 బ్లాంక్ రౌండ్లు.