Reading Time: < 1 minute

భద్రాద్రికొత్తగూడెం: కుళ్లిన ఆహార పదార్థాలపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏకలవ్య స్కూల్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ స్టోర్‌‌‌‌‌‌‌‌రూంలో కూరగాయలు కుళ్లిపోయి ఉండటాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఆహార పదార్థాలతో విద్యార్థులకు ఎలా వండి పెడతారని ప్రశ్నించారు. క్యాటరింగ్ అసిస్టెంట్ మంగీలాల్‌‌‌‌‌‌‌‌ను నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ అమలులో నిర్లక్ష్యం చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.