Reading Time: < 1 minute
Mamitha Baiju Hospitalised Health Update Australia Event Postponed

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్‌బోర్న్‌లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్‌బోర్న్‌లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.

మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.