Reading Time: < 1 minute

మైథలాజికల్ థ్రిల్లర్ ‘కూర్మావతార్’ టీజర్ రిలీజ్… యాక్షన్ మోడ్‌లో శివరాజ్‌కుమార్, రాజ్ తరుణ్!

Caption of Image.

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కూర్మావతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో పూజిత కె, నరేంద్ర కొండ, సెవితా రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  లేటెస్ట్ గా  ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

పురాణాలకి, వర్తమాన సామాజిక సంఘర్షణకి ముడిపెడుతూ ఈ టీజర్‌ను అత్యంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. మంచి, చెడుల మధ్య జరిగే యుగాంత పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమని టీజర్ స్పష్టం చేస్తోంది. ఒక పవర్‌ఫుల్ యోగి అవతారంలో డార్క్ ఫోర్సెస్‌తో శివరాజ్‌కుమార్ పోరాడుతున్న తీరు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. సాయికుమార్ అందించిన గాంబీర్యమైన వాయిస్‌ ఓవర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇక రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్ పూర్తి స్థాయి యాక్షన్ మోడ్‌లో కనిపించి తమ పాత్రలకున్న ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ షేడ్స్‌లో వీరిద్దరూ అలరించబోతున్నారు. మైథాలజీ, ఫాంటసీ, మోడర్న్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బ్లెండ్ చేసిన తీరు, అజనీష్ లోక్‌నాథ్ అందించిన కంపాన్ని పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), రిచ్ విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

►ALSO READ | రవితేజ వారసుడు మాధవ్ ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ విలేజ్ యాక్షన్ డ్రామాతో గూస్‌బంప్స్!

ప్రస్తుతం ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
 

 

©️ VIL Media Pvt Ltd.