Reading Time: < 1 minute

 తమిళనాడు ఆలయాల్లో మొబైల్స్ బ్యాన్..ఇవాళ్టి(సెప్టెంబర్1) నుంచే అమల్లోకి

Caption of Image.

తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో సెల్‌ఫోన్ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయాల్లోకి  సెల్‌ఫోన్లు తీసుకువెళ్లడాన్ని నిషేధిస్తూ హిందూ ధర్మదాయ శాఖ  జారీ చేసిన ఉత్తర్వులు ఇవాళ్టి (సెప్టెంబర్ 1)నుంచే అమల్లోకి వచ్చాయి.

కొంతమంది భక్తులు, ముఖ్యంగా యువత ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయడం, ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఆలయ పవిత్రతకు, ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని ఫిర్యాదులు అందాయి. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు ఆలయాల  ఎంట్రే దగ్గర ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లను భద్రపరుచుకోవడానికి వీలుగా ఒక్కో ఫోన్‌కు కేవలం ఐదు రూపాయల టోకెన్ ఫీజును నిర్ణయించారు. ఫోన్ నంబర్, మోడల్ నమోదు చేసుకుని  రషీదు ఇస్తారు. దర్శనం పూర్తయ్యాక ఆ రసీదు చూపించి ఫోన్లను వెనక్కి తీసుకోవచ్చు.

►ALSO READ | మీకు తెలుసా : ఆధార్ కార్డు రెండు రంగుల్లో ఇస్తారని.. ఈ రెండు ఆధార్ కార్డులకు తేడా ఏంటో తెలుసుకోండి..!

భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలు, ప్రధాన వీధుల్లో పలు  భాషల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా కూడా దీనిపై ప్రచారం కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు భక్తులందరూ ఈ నిబంధనకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.