Reading Time: < 1 minute

ఆస్తులు గుంజుకుని తిండిపెట్టకుండా.. నా కొడుకులు ఇంటి నుంచి గెంటేశారు

Caption of Image.

కన్న కొడుకులే కాలయముల్లా తయారయ్యారు. ఆస్తులన్నీ  లాక్కొని కనీసం పట్టెడు అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేసిన దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డి జీవితం ఇపుడు కన్నీటి సంద్రమైంది. భార్య కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో ఒంటరైన ఆయనను, ఇద్దరు కొడుకులు నమ్మించి ఉన్న ఆస్తులన్నీ కాజేసారు. ఆ తర్వాత కనీసం తిండి పెట్టకుండా, ఇంట్లోకి రావద్దంటూ నడిరోడ్డుపైకి గెంటేశారు.

అందరూ ఉండి కూడా అనాథలా మారిన ఆ తండ్రి.. తనకు న్యాయం చేయాలంటూ వికారాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించి అధికారుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. కష్టపడి సంపాదించిన ఆస్తిని లాక్కుని, కన్న తండ్రికి కనీస ఆశ్రయం కల్పించని ఇలాంటి క్రూరమైన కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.