
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది APSRTC. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇకపై బస్టాండ్ కి వెళ్లకుండా తమ ఇంటికి దగ్గర్లోనే బస్సు ఎక్కే సదుపాయం ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు అధికారులు.
విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణించే ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రయాణికులు ఉండే బృందాలకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ప్రయాణికుల బోర్డింగ్ పాయింట్, బస్సు స్టేషన్ మధ్య దూరం వివరాలు అందించి ఆ దూరానికి వర్తించే ఛార్జిని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అధికారులు.
►ALSO READ | 1000 రోజుల ప్రజాపాలన.. మహిళలకు ఫ్రీ జర్నీ నుంచి ఈవీ బస్సుల దాకా.. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం నాలుగు గంటల ముందుగా 732825450, 9959225450 నంబర్లను సంప్రదించాలని… ఈ సదుపాయాన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య పొందవచ్చని తెలిపారు. విజయవాడలోని పీఎన్‌బీఎస్ నుంచి ఉదయం 9.10 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సును, హైకోర్టుకు చేరకముందే సీడ్ యాక్సెస్ రోడ్, సీఆర్డీఏ మీదుగా మళ్లించినట్లు తెలిపారు అధికారులు.