Reading Time: 2 minutes

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అడల్ట్, పోర్న్ యాప్‌ల ముసుగులో జరుగుతున్న భారీ ఆర్థిక మోసాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు గుంజుతున్నట్లు కేంద్ర సైబర్ విభాగం (I4C) హెచ్చరించింది. ఈ మోసాలు ఎలా జరుగుతాయి, మన ఫోన్‌లను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అశ్లీల ప్రకటనలతో ఎర: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో సైబర్ నేరగాళ్లు ఆకర్షణీయమైన అశ్లీల ప్రకటనలు ఇస్తారు. ఇక వీటిని క్లిక్ చేయగానే వినియోగదారులు సాధారణంగా అజ్ఞాత డొమైన్‌లకు మళ్లించబడతారు. అక్కడ గూగుల్ ప్లే స్టోర్‌లో లేని, థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ ప్యాకేజీ (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోమని ప్రేరేపిస్తారు.

అప్‌డేట్ పేరుతో హ్యాకింగ్: వినియోగదారులు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పేరుతో మరొక డేంజరస్ ప్యాకేజీని డౌన్‌లోడ్ చేయమని కోరుతారు. ఇక ఆ తర్వాత ఈ మాల్వేర్ ఫోన్ సెట్టింగ్స్‌లో ఉండే ఆక్సెసిబిలిటీ అనుమతులను దొంగతనంగా దక్కించుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తుంది.

Downloading Porn Apps? Government Warns of Rising Cyber Scams
Downloading Porn Apps? Government Warns of Rising Cyber Scams

బ్యాంకు ఖాతాలు ఖాళీ: ఈ మాల్వేర్ యాప్‌లు మీ ఫోన్‌లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ను ఇన్‌స్టాల్ చేసి, ఇంటర్నెట్ డేటాను హ్యాకర్ల సర్వర్లకు మళ్లిస్తాయి. ఇక దీనివల్ల మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలు  బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. మీ అనుమతి లేకుండానే మీ బ్యాంక్ ఖాతాల నుంచి అనధికారికంగా డబ్బులు దొంగిలిస్తారు.

అన్‌ఇన్‌స్టాల్ చేయడం కూడా కష్టమే: ఒక్కసారి ఈ మాల్వేర్ యాప్స్ ఫోన్ లోకి ప్రవేశిస్తే, సాధారణ సెట్టింగ్స్ ద్వారా వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడం కూడా సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, అపరిచిత యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.

ఇక అపరిచిత మూలాల నుంచి లేదా అశ్లీల ప్రకటనల ద్వారా వచ్చే ఎలాంటి యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకపోవడమే అత్యంత సురక్షితం. ఒక చిన్న అలసత్వం మీ వ్యక్తిగత సమాచారాన్ని, కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్ల పాలు చేస్తుందని గుర్తుంచుకోండి.

గమనిక:ఈ సమాచారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) జారీ చేసిన అధికారిక హెచ్చరికల ఆధారంగా లబ్ధిదారులు, ఇది అవగాహన కోసం అందించబడింది. ఏవైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి.

The post పోర్న్ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? సైబర్ మోసాలపై కేంద్రం అలర్ట్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.