Reading Time: < 1 minute
Jackky Bhagnani Calls Marriage With Rakul Preet Singh A Situationship Interview Viral

టాలీవుడ్.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకునే ఈ జంట, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచారు. తన భార్య రకుల్‌తో ఉన్న బంధం గురించి జాకీ వాడిన ఒక పదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ‘సిట్యుయేషన్‌షిప్’ అనే పదాన్ని ఒక స్పష్టత లేని బంధం గురించి చెప్పడానికి వాడుతుంటారు. కానీ జాకీ దీనిని ఒక కొత్త కోణంలో వివరించారు.. ‘మాకు పెళ్లయింది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నట్లే ఫీలవుతాం. అంటే మా మధ్య బంధం ఎప్పుడూ కొత్తగా, బోర్ కొట్టకుండా ఉంటుంది. మేము ఒకరికొకరం ఎంతో ఎక్స్‌క్లూజివ్ (Exclusive), కానీ మా మధ్య ఉన్న స్నేహం వల్ల నేను దేని గురించైనా ఆమెతో ఓపెన్‌గా మాట్లాడగలను’ అని జాకీ చెప్పుకొచ్చారు. మనకు తెలిసి పెళ్లయిన తర్వాత చాలా జంటలు ఒక రకమైన బాధ్యతల్లో మునిగిపోయి రొమాన్స్‌ను మిస్ అవుతుంటారు. కానీ రకుల్-జాకీ మాత్రం పెళ్లికి ముందు ఉన్న ఆ ‘డేటింగ్’ వైబ్‌ను, ఆ సరదాను ఇంకా కొనసాగిస్తున్నారట. ఒకరిపై ఒకరు హక్కులు చెలాయించడం కంటే, ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టసుఖాలు పంచుకోవడమే తమ బంధానికి బలమని ఆయన వివరించారు. ప్రజంట్ జాకీ మాటలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, జాకీ భగ్నానీ తన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తున్న ఈ జంట, కొత్తగా పెళ్లయిన వారికి ఒక రకమైన ‘రిలేషన్‌షిప్ గోల్స్’ ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.