
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. ఇరాన్ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు ప్రయోగించాయి. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ భవనంపై రెండు దేశాలు దాడులకు పాల్పడ్డాయి. దాడులకు ముందే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని బంకర్ లోకి వెళ్లారు. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో దాడులు జరిగాయి. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలలో గగనతలం మూసివేయడంతో విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇజ్రాయెల్ లో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇరాన్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వేలాది మంది సైనికులు మరణించారని ఇరాన్ తెలిపింది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో రెండు దేశాలు వైమానిక దాడులకు పాల్పడాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇస్ఫహాన్ లోనే న్యూక్లియర్ తయారీ కేంద్రాలపై దాడులు చేస్తుండడంతో ప్రతిదాడులకు ఇరాన్ సిద్ధమవుతుంది. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ పై ఇరాన్ విరుచుకుపడింది. 35కి పైగా మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్ధం మీరు ప్రారంభించారు కానీ మేము ముగింపు పలుకుతామని హెచ్చరించింది. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని ఘాటు విమర్శలు చేసింది.
Footage of #Iran targeting US base in Bahrain. https://t.co/sNlT3gw0kI pic.twitter.com/VWkr8fMeDF
— 24hr Geopolitics (@24hrGeopolitics) February 28, 2026
Explosions in #Bahrain‘s Al Juffair, where U.S. naval base and 5th fleet headquarters is located.#Iran #Israel pic.twitter.com/tzdulYo5t1
— Karan Singh (@Journo_Karan) February 28, 2026
استهداف إيراني مكثف لقاعدة الجفير الأمريكية في العاصمة البحرينية المنامة#Iran #إسرائيل pic.twitter.com/4BkD89o96k
— حــنـيـن الـيـاسـري (@LyAsnat44950) February 28, 2026
Visuals from holin Isreal.#Iran
pic.twitter.com/IBefBg2qWq— Aly (@Alisheikh870) February 28, 2026