
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ జట్టు ఘన విజయం సాధించింది. 67 సంవత్సరాల తర్వాత జమ్ము జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న జమ్ము కశ్మీర్ జట్టు కర్ణాటకతో తలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసి జమ్ము కశ్మీర్ జట్టు ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్‌లో శుభం పుందిర్ 121, యావర్ 88, సాహిల్ 72, పరాస్ 70, కన్హయ్య 70, అబ్ధుల్ 61 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక జట్టు 293 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక బ్యాటింగ్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులు చేశాడు. ఇక 291 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ముకశ్మీర్ జట్టు మరోసారి భారీ స్కోర్ సాధించే ప్రయత్నం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్‌లో కమ్రన్ ఇక్బాల్ 160, సాహిల్ 101 పరుగులు చేశారు. దీంతో జమ్ము కశ్మీర్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫైనల్‌లో శుభమ్ పుందిర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. అకీబ్ నబీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.