Reading Time: < 1 minute

హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్ము కశ్మీర్ అవతరించడం ఇక లాంఛనమే. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ జట్టు భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు, జమ్ము కశ్మీర్‌కి చెందిన పర్వేజ్ రసూల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఆయన అన్నాడు.

‘‘యుధ్వీర్‌సింగ్ కర్ణాటకలో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ తీశాక.. నేను చాలా ఆనందపడ్డాను. శనివారం (ఈ రోజు) జమ్ము కశ్మీర్ రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా అవతరించనుంది. ఇకపై ఇది కల కాదు.. వాస్తవం. మేం ఈ స్వప్నం సాకారం కావడం కోసం దశాబ్ధలుగా ఎదురు చూస్తున్నాం’’ అని పర్వేజ్ అన్నాడు. అలాగే మ్యాచ్‌ ప్రత్యర్థివి ఐదు వికెట్లు పడగొట్టిన అఖిద్ నఖ్వీని పర్వేజ్ ప్రత్యేకగా అభినందనలు ‘మా కోసం.. అఖిబ్ నఖీ అద్భుతం చేశాడు. ఇలాంటి ప్రదర్శనను ఎవరూ గుర్తించకుండా ఉండలేరు. త్వరలోనే అతడు భారత జట్టుకు ఎంపిక అవుతాడు అనిపిస్తుంది’’ అని పర్వేజ్ పేర్కొన్నాడు.