Reading Time: < 1 minute

 రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాజస్థాన్‌లో జైసల్మేర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ “ ప్రచండ్‌” లో ప్రయాణించారు. ఫ్లైయింగ్ సూట్ ధరించిన ఆమె 25 నిమిషాల పాటు కో పైలట్‌గా వ్యవహరించారు. ప్రచండ్ దేశ స్వావలంబనకు చిహ్నం. జైహింద్, జైభారత్ అని కాక్‌పిట్ నుంచి దేశ ప్రజలకు సందేశం పంపారు. ఎల్‌సీహెచ్ “ ప్రచండ్‌” అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్. అధునాతన ఏవియానిక్స్, స్టెల్త్ ఫీచర్లు, రాత్రి వేళల్లోనూ దాడులు చేయగల సామర్థం దీని సొంతం. క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్ వంటి ఆయుధాలను ప్రయోగించవచ్చు.