Reading Time: < 1 minute

సమ్మర్‌‌‌‌‌‌‌‌ లో వస్తోన్న మా ఇంటి బంగారం

Caption of Image.

సమంత లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ  రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. సమ్మర్  స్పెషల్‌‌‌‌గా మే 15న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  

సినిమా చిత్రీక‌‌‌‌ర‌‌‌‌ణ తుది ద‌‌‌‌శ‌‌‌‌కు చేరుకుందని, ఈ  యాక్షన్ డ్రామా మూవీని  అన్ని కమర్షియల్ అంశాలతోపాటు బలమైన ఎమోషన్స్‌‌‌‌తో ఉత్కంఠరేపేలా రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన సమంత లుక్స్,  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.   దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషిస్తున్నారు.  

సంతోష్ నారాయణన్  సంగీతం అందిస్తున్నాడు.  ‘ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.