
కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా చిర స్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన గీతాలలో ఒకటి మనోహర. మిన్నలే సినిమాలోని ఈ పాట ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సాధించింది. దాదాపు 25 ఏళ్లుగా యూ ట్యూబ్, సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూ, శ్రోతల నుండి విశేష స్పందనను పొందుతోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్, అబ్బాస్, రీమా సేన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం మిన్నలే. ఈ సినిమా 2001లో చెలి పేరుతో తెలుగులోకి డబ్ చేయబడి విడుదలైంది. గౌతమ్ మీనన్ కు ఇది తొలి సినిమా. అప్పట్లో తెలుగు, తమిళ భాషలలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :