
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాను విడుదల చేయడమే కష్టంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన జోరును ప్రదర్శిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమా ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతూ, మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏడాది కనీసం రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఏడాది చివరి నాటికి మరో చిత్రాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ చిత్రీకరణను దాదాపు పూర్తి చేసుకున్న ప్రభాస్, ఈ సినిమాను 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :