Reading Time: < 1 minute
Box Office Destruction With Suriya Karuppu Now All Eyes On Vikrams Massive Comeback

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గట్టి కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో కరుప్పుచూపించింది. మూడు రోజుల్లోనే రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టి   సరైన కమర్షియల్ పడితే సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు మరో విలక్షణ నటుడు చీయాన్ విక్రమ్సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

దక్షిణాది చిత్రసీమలో విక్రమ్‌కు చాలా మంచి క్రేజ్ ఉంది. ‘అపరిచితుడు’ వంటి ఇండస్ట్రీ హిట్లతో పాటు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో స్ట్రాంగ్ కమర్షియల్ హిట్స్, భారీ వసూళ్లు సాధించిన రికార్డు విక్రమ్ సొంతం. అపరిచితుడు సినిమాతో తెలుగులో సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్న విక్రమ్ ఆ రేంజ్ హిట్ మళ్ళి చూడలేదు. శంకర్ ‘ఐ’ సినిమా ఓపెనింగ్ అదరగొట్టింది కానీ చివరికి ప్లాప్ అయింది. అయిన సరే విక్రమ్ సినిమా అంటే తెలుగులో డీసెంట్ ఓపెనింగ్ ఉంటుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మెప్పించగల సత్తా విక్రమ్ కు ఉంది. చియాన్ చేసే విభిన్న పాత్రలకు సరైన స్క్రిప్ట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం. ప్రస్తుతం విక్రమ్ తన రెగ్యులర్ సినిమాల కంటే ఒక మెట్టు పైనున్న పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో కూడిన రైట్ ఫిల్మ్ కోసం చూస్తున్నారు. ఆయన మార్కెట్ రేంజ్‌కు సరిపడా సరైన కమర్షియల్ సబ్జెక్ట్ పడిన రోజున బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాదించడం సింపుల్ మ్యాటర్. సూర్య లాగే విక్రమ్ కూడా త్వరలోనే ఒక భారీ బ్లాక్‌బస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం!