Reading Time: < 1 minute

యువ హీరో శ్రీ విష్ణు.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘విష్ణు విన్యాసం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. త్వరలో ‘మృత్యుంజయ్’ అనే సస్పెన్స్ థ్రిలర్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెబ్బా జాన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ మర్డర్ మిస్టరీ, ఓ పాప చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ని చూసేయండి…