Reading Time: < 1 minute

ఇలాంటి కూతుర్లూ ఉన్నారు.. 130 గజాల స్థలం రాయించుకుని.. బుక్కెడు బువ్వ పెడ్తలేరు !

Caption of Image.

సికింద్రాబాద్: మానవత్వం మంట కలిసింది.. కన్న కూతుళ్ళే కసాయిగా మారారు. కన్నతండ్రి సంపాందించిచన ఆస్తిని మొత్తం లాక్కుని అతనికి తిండి పెట్టకుండా బయటికి గెంటివేసిన ఘటన సికింద్రాబాద్లోని మారేడుపల్లి లక్ష్మి నగర్ బస్తీలో చోటు చేసుకుంది. తనకు కన్న కూతుళ్ళే తిండి పెట్టకుండా గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారని కూతుళ్ళ ఇంటి ముందు తండ్రి రాజలింగం ఆందోనకు దిగాడు. మహంకాళి రాజలింగం అనే వ్యక్తి మిథాని ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు.

మారేడుపల్లిలోని 130 గజాల స్థలాన్ని ఇద్దరు కూతుళ్ళు భాగ్యలక్ష్మి, ఝాన్సీలకు రాసిచ్చాడు. తండ్రి వద్ద నుంచి ఆస్తి తీసుకున్న ఇద్దరు కూతుర్లు అతనికి అన్నం పెట్టకుండా రోడ్డున పడేశారు. దీంతో రాజలింగం ఇంటి ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు. దిక్కు తోచని స్ధితిలో పోలీసులతోపాటు ఆర్డీఓకు తను మొర పెట్టుకున్నాడు. అతనిని బస్తీ వాసులు చేరదీసి అక్కున చేర్చుకొని అన్నం పెడుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.