July 23, 2026

Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!

Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
Reading Time: < 1 minute
Sidiri Appala Raju Remand Hit And Run Case

Sidiri Appala Raju : శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస జేఎంఎఫ్‌సీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు ఆరవ్ వర్మను రక్షించేందుకు కుట్ర పన్నారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

 

తన కుమారుడికి బదులుగా వేరొక వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆయనపై ఏ-3 నిందితుడిగా వివిధ సెక్షన్ల ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఆయనను పలాస న్యాయస్థానంలో హాజరుపరచగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ ఖరారు చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయనను అంపోలు జిల్లా జైలుకు తరలించారు. మాజీ మంత్రి అరెస్టు, జ్యుడీషియల్ రిమాండ్ వార్తలతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అటు పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.