July 23, 2026

Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా

Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా
Reading Time: 2 minutes
Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా

పెళ్లి సంబంధం కుదర్చలేదని ఒక మ్యారేజ్ బ్యూరోపై కోర్టులో కేసు వేసి, నష్టపరిహారం గెలుచుకున్న వింత సంఘటన ఎక్కడైనా చూశారా? అవును, కేరళలో సరిగ్గా ఇదే జరిగింది. మ్యారేజ్ బ్యూరో చుట్టూ ఏకంగా 9 ఏళ్లు తిరిగినా పెళ్లి కాకపోవడంతో… ఓ ప్రొఫెసర్ ఏకంగా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి నష్టపరిహారం రాబట్టాడు. కేరళలోని కన్నూర్‌కు చెందిన ఒక నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్, తన పెళ్లి కోసం 2016 నవంబర్‌లో ‘శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరో’ను సంప్రదించాడు. అందుకోసం రూ.3,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాడు. కాసరగోడ్‌కు చెందిన ఒక మంచి అమ్మాయితో సంబంధం కుదుర్చుతామని సదరు బ్యూరో అతనికి గట్టిగా హామీ ఇచ్చింది. కానీ, కట్ చేస్తే… ఏళ్లు గడుస్తున్నా ఆ ముచ్చట మాత్రం తీరలేదు. తగిన సంబంధం వస్తుందని మ్యారేజ్ బ్యూరో పదే పదే నమ్మిస్తూ రావడంతో 9 ఏళ్లు గడిచిపోయాయి. ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే అతని వృద్ధ తల్లిదండ్రులు కొడుకు పెళ్లి చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, దురదృష్టవశాత్తు 2025 అక్టోబర్‌లో అతని తండ్రి క్యాన్సర్‌తో కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న తల్లి ఇప్పటికీ కొడుకు పెళ్లి కోసం ఆశతోనే ఎదురుచూస్తోంది. 9 ఏళ్లుగా పెళ్లి కాకపోవడంతో ఆ ప్రొఫెసర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇక లాభం లేదనుకుని, సేవాలోపం కింద ఆ ప్రొఫెసర్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి రూ. 15,000 పరిహారం కోరాడు. అయితే కమిషన్ ఇచ్చిన నోటీసులకు మ్యారేజ్ బ్యూరో అస్సలు స్పందించలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన కమిషన్… బ్యూరో సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారించి సంచలన తీర్పు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,000 తిరిగి ఇవ్వడంతో పాటు, మానసిక వేదనకు రూ. 3,000, కోర్టు ఖర్చుల కింద రూ. 2,000… మొత్తంగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ 30 రోజుల్లోగా ఈ డబ్బులు చెల్లించకపోతే, ఏడాదికి 9 శాతం వడ్డీ కూడా కట్టాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం కింద తదుపరి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పెళ్లిళ్లు స్వర్గంలో అవుతాయో లేదో తెలీదు కానీ, మోసం చేస్తే మాత్రం కోర్టులు ఊరుకోవు అని ఈ సంఘటన నిరూపించింది!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!