July 23, 2026

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి..

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి..
Reading Time: 2 minutes
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి..

ఆహారం ఎంత ముఖ్యమో మన శరీరానికి నీళ్లు కూడా అంతే ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామందికి భోజనం తింటున్న సమయంలో తరచుగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది భోజనంతో పాటు మధ్యమధ్యలో నీరు తాగుతుంటారు. కానీ సైన్స్, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ చిన్న అలవాటు మీ జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతుందని తెలుసా? అవును.. మీరు భోజనంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి కొన్ని రకాల జీర్ణ రసాలు, యాసిడ్లు విడుదలవుతాయి. తింటున్నప్పుడు నీళ్లు తాగడం వల్ల ఈ యాసిడ్ల గాఢత తగ్గిపోయి ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటే ఈ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది.

గుండెల్లో మంట, ఎసిడిటీ పెరిగే ప్రమాదం

భోజనం మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. పొట్టలో నీరు చేరడం వల్ల జీర్ణరసాల కదలికలు మారి, యాసిడ్ పైకి అనగా అన్నవాహికలోకి రావడానికి దారితీస్తుంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం ఉద్భవిస్తాయి.

అసంతృప్తికరమైన ఆకలి – అతిగా తినడం

అవసరానికి మించి భోజనంతో పాటు నీరు తాగితే కడుపు నీటితోనే త్వరగా నిండిపోతుంది. దీనివల్ల తాత్కాలికంగా ఆకలి తీరినట్లు అనిపించినా, కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఏదో ఒకటి తినాలనే కోరిక పెరగడం జరుగుతుంది. ఇది శరీర బరువు పెరగడానికి మరియు జీవక్రియ దెబ్బతినడానికి కారణమవుతుంది.

కడుపు బరువుగా అనిపించడం

తింటున్నప్పుడు ప్రతి ముద్దకూ నీళ్లు తాగే అలవాటు ఉంటే, ఆహారం, నీరు కలిసి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దీనివలన భోజనం చేసిన తర్వాత ఉత్సాహంగా ఉండటానికి బదులు కడుపు భారంగా, బద్ధకంగా అనిపిస్తుంది. భోజనానికి అరగంట ముందు లేదా తిన్న 30 నుండి 45 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగడం మంచిది. ఒకవేళ భోజనం చేసేటప్పుడు గొంతులో ఆహారం అడ్డుపడినా లేదా బాగా పొడిబారినా, కేవలం ఒక చిన్న గుటక నీరు మాత్రమే తాగాలి కానీ గ్లాసుల కొద్దీ తాగకూడదు. ఈ చిన్న మార్పుతో మీ జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు.