Reading Time: < 1 minute
Massive Fire At Tech Mahindra Office In Chennai Employees Evacuated Safely

చెన్నైలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉద్యోగులను భవనం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్ది నిమిషాల్లోనే మంటలు కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో దట్టమైన నల్లపొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అధికారుల ప్రకారం కార్యాలయంలో ఉన్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించగా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల వివరాలు నమోదు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.