Reading Time: 2 minutes
Tilak Varma Strike Rate Debate Mohammad Kaif Comments Team India Role T20

Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్‌ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్‌గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్‌లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిల పడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి ఉండటంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు వచ్చిన గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిలక్ బ్యాటింగ్‌లో పాత ఫ్లో కనిపించడం లేదనే వాదన జోరందుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో 107 పరుగులు చేసినా స్ట్రైక్‌రేట్ 118.88 మాత్రమే ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ లెక్కలు తిలక్ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం గురించే చర్చకు దారితీసేలా చేశాయి.

READ MORE: Medical Miracle:వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భాశయం లేని మహిళకు పండంటి బిడ్డ.. ఎలా సాధ్యమైంది?

ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో తిలక్ పాత్రను టీ20 ఛేజింగ్‌లలో విరాట్ కోహ్లీ టెంప్లేట్‌తో పోల్చారు. ప్రతి ఆటగాడికి జట్టులో స్పష్టమైన పాత్ర ఉండాలని తెలిపారు. తిలక్ తన సహజమైన ఆటను వదిలి ఇతరుల మాటలు పట్టించుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. తిలక్ బలం ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, చివరి వరకు ఆడటమని స్పష్టం చేశారు. ఛేజ్‌లలో విరాట్ కోహ్లీ తరహా పాత్రను తిలక్ పోషించాలని చెప్పారు. పెద్ద షాట్ కోసం ముందుకు వచ్చి ఔట్ కావడం తిలక్ సహజమైన ఆటకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే.. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం అగ్రెసివ్‌గా ఆడే ఆటగాళ్లతో నిండిపోయిందని కైఫ్ గుర్తుచేశారు. “అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు చెలరేగుతారు. వేగంగా పరుగులు పూర్తి చేస్తారు. అలాంటి సమయంలో తిలక్ వర్మ లాంటి వాళ్లు నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్ చివరి వరకు పోరాడాలి. ఈ పాత్ర చాలా కీలకం. ఛేజ్ మాస్టర్ కావాలంటే 20వ ఓవర్ వరకు క్రీజులో ఉండే ఆటగాడు తప్పనిసరిగా ఉండాలని, ఆ పాత్ర తిలక్ పోషించాల్సిందే.” అని సూచించారు.

READ MORE: Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!