Reading Time: < 1 minute
Thalaivar 173 Basil Joseph Priyanka Mohan To Join Rajinikanths Film

సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్ 2’ లో నటిస్తున్నాడు రజనీ. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిబి, ఈ చిత్రాన్ని ఒక పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు.

 Also Read : Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ నటించనున్నాడు. మలయాళంలో వచ్చిన ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న బసిల్, తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అలాగే తమిళ భామ ప్రియాంకా మోహన్ కూడా ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంకా మోహన్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ‘డాన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఉలగనాయగన్ కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.