Reading Time: < 1 minute

Telangana Municipal Elections: సగం తెలంగాణలో మూతబడిన వైన్ షాపులు : 2 రోజులు డ్రై డే

Caption of Image.

తెలంగాణలోని అన్ని మున్సిపల్ పట్టణాలు.. 7 కార్పొరేషన్లలో వైన్ షాపులు బంద్ అయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీ మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్ జరగనున్న క్రమంలో.. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ అయ్యింది. ఎన్నికల్ నిబంధనల ప్రకారం.. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మందు షాపులు క్లోజ్ చేశారు వ్యాపారులు. 

11వ తేదీ జరగనున్న పోలింగ్ లో.. 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు ప్రభావం చూపించకుండా.. ప్రలోభాలకు గురి చేయకుండా.. అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్స్ అన్నింటిని క్లోజ్ చేయించారు ఎన్నికల అధికారులు. పోలింగ్ జరిగే 11వ తేదీ వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. దీంతో పాటు కౌంటింగ్ జరిగే 13వ తేదీన కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.

►ALSO READ | బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి.. తెలంగాణాలో దరిద్రానికి కారణం బీఆర్ఎస్సే: సీఎం రేవంత్

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారానికి సోమవారం ( ఫిబ్రవరి 9 ) సాయంత్రంతో గడువు ముగియడంతో మైకులు బంద్ అయ్యి పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.