సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు..

తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా.. ఇప్పుడేమో మన మేకర్స్ దృష్టి మన స్వాతంత్ర్య పోరాట నేపథ్యంపై పడింది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) నేపథ్యంలో కథలు అల్లడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గడచిన మూడేళ్లలో ఈ తరహా కాన్సెప్ట్స్‌తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ బాట ఎందుకు పడుతున్నారు లైన్‌లో ఉన్న ఆ భారీ ప్రాజెక్ట్స్ ఏంటి రీసెంట్ రికార్డ్ చూస్తే.. టాలీవుడ్‌లో నేతాజీ ట్రెండ్‌కు గట్టిగా కనిపిస్తోంది. 2023లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘స్పై’ సినిమా ఏకంగా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ ఫైల్స్ మిస్టరీ చుట్టూనే సాగింది. ఈసినిమా కమర్షియల్‌గా మెప్పించకపోయినా… ఆ కాన్సెప్ట్‌కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. కల్యాణ్ రామ్ ‘డెవిల్’ లోనూ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథకు, ఆజాద్ హింద్ ఫౌజ్ కనెక్షన్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా ముడిపెట్టారు. ఈ రెండు సినిమాల్లోని ఆ కోర్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మన టాప్ స్టార్స్ టేకప్ చేయడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీలో ప్రభాస్ నేరుగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసే హీరో, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరటం అనే పాయింటే ఈ సినిమాకు హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇది నేతాజీ బయోపిక్ కాకపోయినా.. దేశం కోసం పోరాడే యోధుడి కథ కావడంతో ఫౌజీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఫౌజీ మాత్రమే కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ లోనూ ఇదే తరహా ట్విస్ట్ ఉందన్న లీక్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథను 1940ల నాటి ఆజాద్ హింద్ ఫౌజ్ సీక్రెట్ ఫండ్స్‌కు లింక్ చేశారట. నేతాజీ దాచిన రహస్య నిధుల మిస్టరీ చుట్టూ పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగుతుందని ఇన్‌సైడ్ టాక్. అటు ప్రభాస్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకేసారి నేతాజీ బ్యాక్‌డ్రాప్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతుండటంతో టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం