
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం ఆమె ఇంగ్లండ్ వెళ్లాల్సి ఉంది. పశ్చియాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె వెళ్లాల్సిన విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో సింధెు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులు రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.