
నాగ్‌పూర్: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కటోల్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ సంస్ఘ ఎస్‌బిఎల్ ఎనర్జి లిమిటెడ్‌లో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. ఉదయం అందులోని ఒక యూనిట్‌లో ప్రమాదం సంభవించిందని.. ఆ సమయంలో 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పని చేస్తున్నారని తెలిపారు.