Reading Time: < 1 minute

విద్యుత్ సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం : ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్

Caption of Image.
  • ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్

హైదరాబాద్, వెలుగు : విద్యుత్ సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, అందరూ సమష్టిగా పనిచేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని ఎస్ పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎస్ పీడీసీఎల్ సీఎండీ గా బాధ్యతలు స్వీకరించిన జితేశ్ వి పాటిల్‌‌‌‌ను శనివారం అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. 

సీఎండీని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య, సెక్రటరీ కె.వెంకటేశ్వర్లు, అసోసియేషన్ నాయకులు పరమేశ్, అనిల్ కొండారెడ్డి, రవి, వాసు తదితరులు ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.