Reading Time: < 1 minute

హైదరాబాద్: తండ్రి అంత్య క్రియలు జరిగి 24 గంటలు కాకముందే టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ భారత జట్టుతో కలిశాడు. దీంతో అతడిని క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధను కూడా దేశం కోసం లోపల దిగమింగుకొని కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్ కోసం రావడం అనేది గొప్ప విషయమని కొనియాడుతున్నారు. గుండెల్లో బాధ పెట్టుకొని కూడా దేశం కోసం నిలబడడం గ్రేట్ అని మెచ్చుకున్నారు. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో రింకు సింగ్ బరిలో దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే మైదానంలో కెకెఆర్ తరపున ఎక్కువ మ్యాచ్‌లు రింకు ఆడాడు. ఈ గ్రౌండ్‌పై రింకు ఎక్కువగా అవగాహనం ఉండడంతో పాటు మంచి ట్రాక్ రికార్డు అతడికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్లేయిండ్ లెవన్‌లో అతడు ఆడే అవకాశం ఉంది. ఎవరిని జట్టులోని నుంచి తొలగించి రింకు అవకాశం ఇస్తారనేది సస్పెన్షన్‌గా మారింది. ఓపెనర్‌గా సంజూశామ్సన్-అభిషేక్ శర్మ ఉంటాడు. రింకుసింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. లివర్ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ ఖానాచంద్ర సింగ్ తుదిశ్వాస విడిచారు.