
హైదరాబాద్: కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ దివ్య(28) విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ధరూర్ సిఐ కార్యాలయానికి అటాచ్‌గా పని చేస్తున్నారు. ఇంట్లోనే ఉరేసుకొని దివ్య ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.