Reading Time: < 1 minute

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళేలా కొత్త పోస్టర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యా ణ్ అద్భుతమైన లుక్ కి ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి ఈ చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది. ప్రారంభం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.

పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్‌పై కనిపించే తీరుకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక వీడియో ద్వారా చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ గ్లింప్స్ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందుని అందించనుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో చిత్రానికి మరింత హై వోల్టేజ్ ఎనర్జీని అందిస్తున్నారు. ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.