Reading Time: < 1 minute

జగిత్యాల: ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిన కత్తులు, రాళ్లతో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. కరీంనగర్ జిల్లా బూత్కూరు చెందిన సౌమ్య అనే యువతి మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ అనే వ్యక్తి గాఢంగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల తెలియకుండా ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. యువతి కుటుంబ సభ్యులు మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సఖి సెంటర్‌లో యువతికి పోలీసులు రక్షణ కల్పించారు. శుక్రవారం యువతిని తీసుకెళ్లేందుకు అనిల్ రావడంతో అతడిపై యువతి బంధువులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనిల్ పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. అనిల్ భార్యకు దూరంగా ఉంటున్నాడని కూడా సమాచారం. కులాంతర వివాహమే ఈ దాడికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.