Reading Time: < 1 minute

లక్నో: భార్యతో పారిపోయిన ప్రియుడ్ని ఆమె భర్త తుపాకీలో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా రామ్‌రాజ్ టౌన్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రదీప్ ధిమాన్, పూనమ్ అనే దంపతులు అనే బహసుమా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పూనమ్‌తో సురేంద్ర అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం పూనమ్‌తో సురేంద్ర పారిపోవడంతో అతడిని చంపాలని ప్రదీప్ నిర్ణయం తీసుకున్నారు. మోహలాల్ జగ్‌జీవన్‌పూరీ ప్రాంతంలో మార్కెట్‌లోకి సురేంద్రపై ప్రదీప్ కాల్పులు జరిపి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తాను ప్రతీకారం తీర్చుకున్నానని ప్రదీప్ తెలిపారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తాను ఈరోజు సురేంద్రను చంపేశానని, పారిపోయిన తన భార్యను కూడా చంపేస్తానని హెచ్చరించారు. తాను ఎవరికీ భయపడనని చెబుతూ ఒక వీడియోను సోషల్ మీడియాతో పాటో పోలీసులకు పంపించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడం కోసం మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఎస్పి తెలిపారు. గతంలో సురేంద్రపై కాల్పులు జరపడంతో తృటి తప్పించుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. అప్పుడే పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ప్రియుడితో పారిపోయిన తరువాత భర్తతో భార్య విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.