Reading Time: < 1 minute

హీరో అడివి శేష్ ఇప్పుడు పూర్తి గా కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం లో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా మదనపల్లె స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీ రోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా విడుదలైన రుబారూ పాట ప్రేమ, బాధల కలయికగా అందరినీ హత్తుకుంటోంది. సంగీత దర్శకు డు భీమ్స్ అందించిన స్వరాలు రస్టిక్ టచ్‌తో మెలోడీని మరింత మధురంగా చూపించా యి. ఆయనతో పాటు చిన్మయి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శేష్, – మృణాల్ ప్రేమలోని మాధుర్యం, తరువాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధ ఇవన్నీ రుబారూలో స్పష్టంగా కనిపిస్తాయి. ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.