
బొలీవియా: దక్షిణా అమెరికాలోని బొలీవియా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ ఆల్టో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్ వే నుంచి పక్కకు జరిగి రోడ్డుపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడడంతో డెల్ నార్టే ఆస్పత్రికి తరలించారు. నోట్ల కరెన్సీలో లోడుతో విమానం సాంటా క్రజ్ నుంచి ఎల్ ఆల్టో కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రోడ్డుపైకి దూసుకెళ్లడంతో వాహనాలు ధ్వంసం కావడంతో పలు వాహనదారులు మృతి చెందారు. విమానం రోడ్డుపైకి దూసుకరావడంతో వాహనదారులు ప్రాణభయంతో వణికిపోయారు. విమానం నుంచి నోట్ల కట్టలు బయటపడడంతో స్థానికులు ఎగబడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రతికూల వాతావరణంతో పాటు సాంకేతిక లోపంతోనే ఈప్రమాదం జరిగి ఉంటుందని విమానయాన అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.