
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. వారిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కేసు నుంచి విడుదల చేసింది. కోర్టు 23 మంది నిందితులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ కేసుకు సంబంధించి ప్రా థమిక సాక్ష్యాలు, కుట్ర ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఎక్సైజ్ విధానం కేసు కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియా లు జైలు పాలైన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరారోపణలు చేసినప్పుడు బలమైన భౌతిక ఆధారాలను కూడా సమర్పించవలసి ఉంటుందని, కుట్రపూరిత పాత్రను ఆ పాదించినంత మాత్రాన కేసు నిలబడదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆ ధారాలు లేవని తేలితే, ఉన్నత పదవులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఎక్సైజ్ పాలసీ వెనుక ఎలాంటి విసృ్తతమైన కుట్ర లేదా, నేరపూరిత ఉద్దేశ్యం లేదని కోర్టు పేర్కొంది. నిందితుడిని అప్రూవర్ గా మార్చడం ద్వారా నేరం చేసినవారి సంఖ్యను పెంచడం వంటి దర్యాప్తు పద్ధతుల పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
అటువంటి పద్దతులు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కోర్టు పేర్కొంది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇతరులను విడుదల చేస్తూ కోర్టు పది ముఖ్యమైన విషయాలను పేర్కొంది.1. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రాథమికంగా ఎటువంటి ఆధారా లు లేవు. కుట్రలో కేజ్రీవాల్ కు ఆపాదించే ఖచ్చితమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.ద ర్యాప్తు సంస్థ ధ్రువీకరించకుండా, ఒక సాక్షి ఆలస్యంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రధానంగా బయటకు వచ్చింది.2. సాక్షి బలహీనమైన వాంగ్మూలంపై ఆధారపడడం. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణ ఒకే ఒకవాక్యం ఆధారంగా ఉంది. ఆధారాలు లేకుండా ఇది మాత్రమే కుట్రను నిరూపించబోదని కోర్టు పేర్కొంది.3. విధాన పరమైన మార్పులు ప్రత్యక్షపాత్రకు ఆధారాలు కావు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎక్సైజ్ విధానాన్ని మార్చారని, ప్రయోజనాలు పొందారని చూపే ఆధారాలు లేవు, కేబినెట్ నిర్ణయాన్నిఆమోదించడం నేరపూరిత కుట్రగా పరిగణించబడదు.4. దర్యాప్తులో పలు అంశాలు సరైనవి కావని తేలింది. దర్యాప్తు లోపాలపై న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. కొన్ని చర్యలు ముందస్తు తారుమారులా కన్పించాయనడం న్యాయమైన దర్యాప్తు కాదని పేర్కొన్నారు. 5. దర్యాప్తు అధికారిపై శాఖ పరమైన చర్యకు సిఫార్సు.
ఆధారాలు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేసినందుకు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు చేయాలని కూడా కోర్టు సిఫార్సు చేసింది. సాక్ష్యాధారాల ఆధారంగా ప్రాసిక్యూషన్ సాగలేదని కోర్టు ఆందోళన ను ఇది బహిర్గతం చేసింది.6. దాదాపు 36 పేజీల జిఎంఓ దర్యాప్తు కుప్పకూలింది. కుట్రకు సంబంధించి చూపిన 36 పేజీల ప్రింటవుట్ కీలకమైన ప్రాసిక్యూషన్ వాదన రికార్డులకు విరుద్ధంగా ఉన్నట్లు కన్పించింది.7.సమావేశాలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు. విధాన చర్చలకు సంబంధించి ప్రధానంగా డాక్యుమెంటరీ లేదా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ లేకుండా ఆమోద ప్రకటనలను చేశారు.8. పుకార్లు, విరుద్ధ ప్రకటనలు ఈ కేసులో అనేక ఆరోపణలు సాక్ష్యాల వాం గ్మూలాలపై ఆధారపడిఉన్నాయి. అభియోగ దశలో ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరచింది. 9. డిమాండ్ లేదా సరైన రుజువు లు లేవు. అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన డిమాండ్ రుజువు లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. దశలో కోర్టు రికార్డుల్లో ఉన్న విషయాల ఆధారంగా తీవ్రమైన అనుమానంను గుర్తించాలి. సినియర్ రాజకీయ కార్యకర్తలతో సహా నిందితులకు సంబంధించి ప్రాసిక్యూషన్ స్పష్టమైన రుజువులు సమర్పించలేకపోయిందని న్యాయమూర్తి పదేపదే పేర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కోర్టు సీబీఏ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు తిరస్కరించింది.