
వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ విడుదల కానుంది. చిత్ర ప్రదర్శనకు కేరళ హైకోర్టు శుక్రవారం అనుమతిని ఇచ్చింది. పదిహేను రోజులు చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును పూర్తిస్థాయి బెంచ్ నిలిపివేసింది. సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిగింది. అంతకు ముందు విడుదల పై స్టేను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తులు శుశృత్ ధర్మాధికారి, పివి బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. సినిమాను పూర్తి స్థాయిలో చూడలేదు. కేవలం కొన్ని సన్నివేశాలను పరిశీలించే సింగిల్ జడ్జి తమ తీర్పును వెలువరించినట్లు ఉందని ధర్మాసనం పేర్కొంది. . సినిమా విడుదలకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. విడుదల తరువాత తలెత్తే పరిణామాలు ఏమైనా ఉంటే సరిగ్గా స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేరళలో హిందూ మహిళలు ఇస్లాం మతం స్వీకరించిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా తీశారు.