
హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూమిలో అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాక ర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రి కి పంపిస్తామన్నారు. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా చేయాల్సి ఉంటుందని, వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకుండా ఉండవచ్చునన్నారు. జిల్లా కలెక్టర్‌కి కోరుతున్న నివేదిక కోర్టు తీర్పు కేంద్ర మంత్రి కి పంపిస్తే దాని పట్ల అవగాహన వస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసునన్నారు. ఒక కాలేశ్వరానికి సంబంధించిన రుణభారంలో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 48 వేల కోట్లు కిస్తీలు కట్టిందన్నారు. రెండు బడ్జెట్లలో కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఫెడరల్ సిస్టంలో తెలంగాణ తీర్చిన వయసు గల రాష్ట్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని,
పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే విధంగా నిధులు కాకపోయినా అందులో సగమైనా తెలంగాణ కు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణను ఆదుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదన్నారు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి మోసంపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మనం కడుతున్న పన్నులు, వచ్చే నిధులపై తెలియచేయాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రమంత్రిని కోరుతున్నానన్నారు. రైతు భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని హామీలు విఫలం కాకుండా అమలు చేస్తున్నామన్నారు. కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందేనని, అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత రాజకీయ కక్ష సాధింపు ధో రణిలో బిజెపి టాప్ అని విమర్శించారు. కవితకు కోర్టులో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా ఒక అపవాదు మాత్రం ఉం దని, దానికి సంబంధించి తరువాత ప్రజలు చెబుతారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.