
టీవీకే పార్టీ అధినేత ,నటుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్‌లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. విజయ్, సంగీత వివాహం 1999 లో జరిగింది. విజయ్ రెండేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టిన తరువాత విజయ్ వివాహేతర సంబంధంపై అనేక ఆరోపణలు వచ్చాయి.
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మాట్లాడుతూ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని వ్యాఖ్యానించడం వివాదాలకు దారి తీసింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించారు. త్రిష కూడా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది. దీంతో నాగేంద్రన్ తరువాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదం నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్‌పై కొంతవరకు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.